మీ కలలో ఎప్పుడన్నా స్మార్ట్ ఫోన్ చూసారా
మనం రాత్రి పడుకున్న దెగ్గర నుండి రక రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కొన్ని కలలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి కలలకి సంబంధించి రీసెర్చ్ర్లు కొన్ని వింత నిజాలు చెప్పారు. మన కలలో అతి కొద్దిగా లేదా అసలు ఎప్పుడు జరగని విష్యాలు గురించి ఇప్పుడు చూద్దాం.
1.మీ కలలో ఎప్పుడన్నా స్మార్ట్ ఫోన్ చూసారా
ప్రస్తుతం మనం పొద్దున లెగిస్తే వాడేది, రోజులో ఎక్కువ సమయం గడిపేది స్మార్ట్ ఫోన్ తోనే. మరి అంతసేపు వాడే స్మార్ట్ ఫోన్ ఎప్పుడన్నా మీ కలలోకి వచ్చిందా. ఒక రీసెర్చ్ ప్రకారం అతి తక్కువ మంది మాత్రమే తమకి కలలో స్మార్ట్ ఫోన్ కనపడింది చెప్పారు. దీనికీ సైంటిస్టులు ఇచ్చిన సమాధానం మన మెదడులో కలలకి కారణమయ్యే భాగం ఇంకా మన కొత్త ఆవిష్కరణలకు అలవాటు పడలేదంట. అందువల్లే మనం కలల్లో స్మార్ట్ ఫోన్లు ఇతర కొత్త కొత్త ఆవిష్కరణలు చూడడం చాలా అరుదు.
2.మాట్లాడడం, రాయడం
.
మనకి రోజూ ఎన్నో కలలు వస్తూ ఉంటాయి కానీ ఎక్కడ మనం మాట్లాడినట్టు గాని, ఏదన్న చదివినట్టు, ఏదన్న రాస్తున్నట్టు గాని అనిపించదు. మన కలల్లో అన్ని పాత్రలు మాటలు లేకుండానే సంభాషణ జరుగుతుంది దీన్ని గమనించారా. దీనికీ సైంటిస్టులు చెప్పిన కారణం నిద్రలో మన మెదడు చదవడం రాయడానికి సంబందించిన భాగాలు ఆక్టివ్గ వుండకపోవడమే.
3.ఎప్పుడు చూడని వ్యక్తితో మాట్లాడడం
మనం ఇంతవరకూ చూడని కలుసుకోని వ్యక్తులతో కలలో మాట్లాడడం జరగదు. దీన్ని నిరూపించడానికి ఎటువంటి సాక్షాలు లేకపోయినా ఎక్కువ మంది తమకు ఇంతవరుకు కలల్లో పూర్తీ కొత్త వాళ్లు కనబడలేదని చెప్పారు. ఇంకొక ఆసక్తి కరమయిన విష్యం ఏమిటంటే మనం నిజ జీవితంలో చాలా తక్కువ సమయం చూసే వాళ్ళు ఉదాహరణకి మార్కెట్ లో మనకి ఎదురు అయ్యే వ్యక్తులు కూడా మన కలల్లో వస్తూ ఉంటారు.


Comments
Post a Comment