ఒక్క సర్వే తో వందల ఉద్యోగాలు హుష్ కాకి.. కానీ చివరికి ఒక ట్విస్ట్

 IT పరిశ్రమ లో వేల మందిని తొలిగిస్తున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇదే సమయం లో ఇంటి వద్ద make up సేవలు అందించే yes madam సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క సర్వే ఆధారంగా వందల మంది ఉద్యోగులను తొలిగించినట్టు వచ్చిన వార్తలు సంచలనంగా మారింది. 


వార్తలులో వచ్చిన కథనాల ప్రకారం yes madam సంస్థ ఉద్యోగులకు తాము పని సమయంలో వత్తిడిని ఎదురుకొంటున్నారా లేదా అనే ప్రశ్నలతో ఒక సర్వే ను ఇచ్చింది. ఒత్తిడి ని ఎదురుకుంటున్నాం అనే సమాధానం ఇచ్చిన ఉద్యోగులను తొలిగించినట్టు ఆ సంస్థ ఉద్యోగలు కొందరు లింక్డ్ ఇన్ లో పంచుకున్నారు.

ఈ వ్యవహారం మీద భారీగా వ్యతిరేకత వచ్చింది.


దీంతో yes madam సంస్థ స్పందిస్తూ తాము పని ప్రదేశాలలో వత్తిడి గురించి అవగాహనా కలిగించడానికే ఈ రకమైన కాంపెయిన్ చేసినట్టు. ఇది పూర్తిగా ముందుగానే అనుకున్న కాంపెయిన్ లో భాగం అనీ, అలాగే ఏ ఉద్యోగిని కూడా సర్వే ఆధారంగా తొలిగించలేదని తెలిపింది. తమ  ఉద్యోగుల ఒత్తిడి తగ్గించే  విధంగా మసాజ్ లు, వేతనం తో కూడిన సెలవలును అందిస్తునట్టు తెలిపింది.


yes madam సంస్థ స్పందన మీద సోషల్  మీడియా వినియోగదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. లేఆఫ్స్ వల్ల ఎంతో మంది బాదపడుతున్న వేళ, అలాంటి అంశాన్ని కాంపెయిన్ కోసం వాడటం బాధ్యత రాహిత్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి .

Comments

Popular posts from this blog

Will Ireland Create a miracle this time against England?

Top 10 must watch movies