Top 10 must watch movies

 1. Kumbalangi Nights

    Watch Kumbalangi Nights | Prime Video

    కేరళకి చెందిన ఈ సినిమా నిజ జీవితానికి దెగ్గరగా ఉంటుంది. ముగ్గురు వేరు వేరు వయసులు ఉన్న అన్నదమ్ముల చుట్టూ తిరిగే ఈ కథ బాగా ఆకట్టుకుంటుంది. imdb రేటింగ్ 8.6  ఉందంటేనే ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో అర్ధమవుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉంది.

2. Uma Maheswarasa Ugra Rupasya

    Uma Maheswara Ugra Roopasya (2020) | Cast & Crew | News | Galleries | Movie  Posters

 మహేశ్ఇంతే ప్రతీకారం అనే మరొక కేరళ సినిమా తెలుగు రీమేక్ యే ఈ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య. దీన్ని C/O Kancharapalem ఫేమ్ మహా వెంకటేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో తనకి అనుకోకుండా ఎదురు అయ్యే కొన్ని సంఘటనలని ఎలా ఎదురుకున్నాడు, ఆ ప్రయత్నం లో తనని తాను ఎలా తిరిగి కనుక్కున్నాడు అనేదే కథ, చాలా మంచి సినిమా. ఈ సినిమా netflix లో అందుబాటులో ఉంది.  

3.joseph

Joseph (2018 film) - Wikipedia

      వేరు వేరు సంఘటనలలో తన భార్యని, కూతుర్ని ఇద్దర్ని కోల్పోయిన ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కి ఇద్దరు ఒకే రకంగా మరణించడం అనుమానం కలిగిస్తుంది. దానితో తానే స్వయంగా విచారించడం మొదలుపెడతాడు. తన విచారణలో ఎం కన్నుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

4.Karwaan 

Watch Karwaan | Prime Video

   డెలివరీ కంపెనీ చేసే ఒక పొరపాటు వల్ల దుల్కర్ సల్మాన్ ఒక ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో ఎదురు అయ్యే సంఘటనలే ఈ సినిమా. ఇర్ఫాన్ ఖాన్, దుల్కర్ సల్మాన్ పెరఫార్మన్సెస్ ఈ సినిమాకి పెద్ద ప్లస్. అమల ఇందులో గెస్ట్ రోల్ చేసారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

5.Charlie 

Charlie (2015 Malayalam film) - Wikipedia

దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన సినిమా చార్లీ. కొత్తగా అద్దెకి దిగిన పార్వతి మీనన్ కి ఆ రూమ్ లో పూర్తీ కానీ కథ ఉన్న ఒక పుస్తకం దొరుకుతుంది. ఆ కథని పూర్తిగా తెల్సుకునే ప్రయత్నంలో దుల్కర్ సల్మాన్ గురించి తెలుసుకుంటూ చివరికి అతన్ని కలుసుకోవడమే ఈ సినిమా. మూడ్ బాగాలేనపుడు చూడడానికి బెస్ట్ మూవీ చార్లీ.

6.Thadam

Thadam public review: This crime thriller starring Arun Vijay leaves  audience asking for more - Bollywood News & Gossip, Movie Reviews, Trailers  & Videos at Bollywoodlife.com


    అరుణ్ విజయ్ డ్యూయల్ రోల్లో నటించిన సినిమా తడం. సస్పెన్స్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా చివరికి మనల్ని ఎంతో confuse చేస్తూ ఉత్కంఠగా సాగుతుంది. ఈ సినిమాని తెలుగు లో రామ్ రెడ్ గా మరియు బాలీవుడ్లో సైతం రీమేక్ కాబడ్తుంది.

7.Bhanumati & Ramakrishna 

Review : Bhanumathi & Ramakrishna (Available on AHA) – Sensible Rom-com |  123telugu.com

ఆఫీస్ లో పని చేసే ఇద్దరి మధ్య జరిగే సంఘటనలు, అది ఎక్కడికి దారి తీసింది అనేదే ఈ సినిమా కథ. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా అన్ని ఎమోషన్స్ తో ఉంటుంది. ఈ సినిమా aha లో ఉంది.

8.R.I.P( Ee.Ma.Yau)

R.I.P. (2018) - IMDb

ఎప్పుడు ఇంట్లో ఉండకుండా దేశం పట్టుకుని తిరిగే తన తండ్రి ఒక రోజు ఇంటికి వచ్చి చనిపోతాడు. ఆ తర్వాత అతను ఎదురుకునే చిన్న చిన్న సంఘటనలే ఈ రిప్ సినిమా. సినిమా లో కథ కంటే అది తీసిన విధానం బాగుంటుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

9.Trance

Trance' review: Fails to impress overall despite its bold theme - The Week

    మోటివేటర్ నుంచి పాస్టర్ గా మారిన ఒక వ్యక్తి జీవితం అనుభవాల గురించి సాగేదే ట్రాన్స్ సినిమా. మతం ముసుగులో జరుగుతున్న అవినీతి, ఘోరాల గురించి కళ్ళకి కట్టినట్టు ఈ సినిమాలో చూయించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది 

10.C U Soon 

C U Soon movie review: A reminder to log in to the real world |  Entertainment News | Manorama English

  డిఫరెంట్ మూవీస్ ని ఇష్ట పడే వాళ్లకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. కేవలం ఒక వరం రోజుల వ్యవధిలో జరిగే సంఘటనలే ఈ సినిమా. ఈ సినిమా లాక్డౌన్ టైం లో డైరెక్ట్ ఓట్ రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఉంది.
 




Comments

Popular posts from this blog

Will Ireland Create a miracle this time against England?

ఒక్క సర్వే తో వందల ఉద్యోగాలు హుష్ కాకి.. కానీ చివరికి ఒక ట్విస్ట్