పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫార్మ్ హౌస్ లోనే ఎందుకు ఉంటారు

 పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫార్మ్ హౌస్ లోనే ఎందుకు ఉంటారు? పవన్ కళ్యాణ్ పార్టీ ని నిర్మించకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జగన్ లాగా పాదయాత్ర లాంటివి చేస్తూ పార్టీని బలపరచడం లేదు?

ఇలాంటి ప్రశ్నలు వేరే పార్టీలకి చెందిన వారు ఎంతలా విమర్శించడానికి వాడుతున్నారో, అందరికీ కాకపోయినా జనసేన అభిమానులలో కూడా కొంత మంది మనసులలో ఇవే ప్రశ్నలు ఉన్నాయ్.ఇలాంటి ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారిని ఏంతో కొంత అర్ధం చేసుకున్నాను అని అనుకుంటున్న నేను నాకు తెల్సిన దానిలో విశ్లేషణ చేస్తున్నాను. 

జగన్ గారు గాని చంద్రబాబు గారిని గాని చూస్తే వాళ్ళు అధికారం లో లేనప్పుడు ఎలాంటి సమస్యకి పరిష్కారం చూయించడానికి కానీ ఎలాంటి సమస్య మీద పోరాటం చేయడానికి కానీ ఇష్టపడరు. ఉదాహరణకి ప్రతిపక్షంలో ఉన్నపుడు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ గారు ఒక్క ప్రధానమైన సమస్య మీద పోరాటానికి కానీ ఏదన్నా సామజిక మార్పు కోసమైనా పోరాడిండి సున్నా. అయన ప్రధాన అజెండా పాదయాత్ర మొత్తమ్ చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తూ తద్వారా అధికారం లోకి రావడం. ఇక చంద్రబాబు గారి సంగతి చెప్పనవసరం లేదు, ఆయన పాదయాత్ర చేసిన, ప్రస్తుతం పూటకి ఒకసారి జూమ్ అప్ లో కనిపిస్తున్నా అయన ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన చేసే ఒకే ఒక్క పని ప్రభుత్వాన్ని టిట్టి పోయడమే. 

అంటే ఈ రాజకీయ నాయకులు ఇద్దరు చెమటలు కక్కిస్తూ నడవడం నుండి గొంతు చించుకుని తిట్టడం వరకు చేసేది అధికారం కోసం తప్ప వాటి వల్ల ప్రజలకి ఇప్పటిదాకా ఒరిగింది గుండు సున్నా!!!!. అంటే వీళ్లు చేసేవి అన్ని స్టంట్స్ తప్ప ఎదో ప్రజలని ఉద్దరించేది ఏమి లేదు, అధికారం కోసం వెంపర్లాడుతూ చేసే పనులు తప్ప సమస్యల్ని పరిష్కరించడం కోసం వీళ్లు చేస్తుంది ఏమి లేదని ప్రజలు ఎంత త్వరగా అర్ధం చేసుకుంటే అంత త్వరగా వీళ్ళ పబ్లిసిటీ జిమ్మికులు మూతబడతాయ్. 

పవన్ కళ్యాణ్ గారిని చుస్తే అయన టీడీపీ, బీజేపీ అధికార పక్షంలో భాగమైనప్పుడు ఉద్దానం సమస్య, మంగళగిరి చేనేత కార్మికుల సమస్య కోసం, అలా సమస్యల పరిష్కరానికి వెంపర్లాడాడు తప్ప అధికారం కోసమో తనకి అందులో ఏమన్నా లాభం కోసమో చూస్కోలేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా సుగాలి ప్రీతి, ఇసుక కార్మికుల సమస్య, రైతుల బకాయిల సమస్య లాంటి సమస్యల పరిస్కారం తప్ప ఏరోజూ అధికారం కోసం దేశానికి ప్రజలకి ఏమాత్రం పనికిరాని పబ్లిసిటీ స్టంట్స్ చేయలేదు. అంటే ఫార్మ్ హౌస్ లో ఉన్న సినిమా షూటింగ్ లో ఉన్న అయన మనసు ప్రజల మీద ఉంటుంది సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిస్కారం కోసం ఆలోచిస్తూనే ఉంటుంది. మిగతా రాజకీయ నాయకులు ప్రజల మధ్య ఉన్న రోడ్ల మీద ఉన్న వాళ్ళ మనసు అధికారం మీద డబ్బు మీద హోదా మీద ఉంటుంది. ఈ తేడాని ప్రజలు తెలుసుకోవాలి. అధికారం, డబ్బు, హోదా, తనకి త్రుచ్చం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి దెగ్గర నుంచి అలాంటి పబ్లిసిటీ స్టంట్స్ ఆశించడం మన తప్పు. 

పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యర్థి పార్టీల నుండి మరియు కొంత మంది అభిమానులు సైతం చేసే మరొక ప్రధానమైన విమర్శ పార్టీని నిర్మించడంలేదు అని. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడ్డే తన లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు, జనసేన ని అధికారం కొసం కాకుండా సాధారణ ప్రజలకి రాజకీయ వేదిక అవ్వడం కోసమే స్థాపించాను అని. పార్టీని నిర్మించడం అంటే ఏంటి? డబ్బు పంచగల్గిన వాళ్ళని తీస్కోచ్చి (వాళ్ళు ఎలాంటి వాళ్ళయినా ఎంత అవినీతి పరులైన) వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిచాక వాళ్ళు ఎంత అవినీతి అక్రమాలు చేసిన ఐదు ఏళ్ళు నోరు మూసుకొని కూర్చోవడమేన?. అలాంటి పార్టీ నిర్మాణం ఐతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ చేయరు. ఆయన లక్ష్యం ఒకటే ప్రజలలోనుండి ముఖ్యంగా యువత లోనుండి రాజకీయ నాయకులు రావాలి దానికి జనసేన వేదిక అవ్వాలి అని. మాటలకి మాత్రమే పరిమితం అవ్వకుండా వ్యవసాయ కూలి కుమారుడికి rtc కండక్టర్ కుమారుడు లాంటి అతి సాధారణమైన వ్యక్తులకి సీట్లు ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీని నిర్మించలేదు అనడం తప్పు ఆయన సామాన్యులకి రాజకీయ వేదిక నిర్మించడం చేశారు. ప్రజలు యువత దాన్ని నిర్మించడమే మిగిలింది. 

ప్రతి వ్యక్తి లోను లోపాలు ఉన్నట్టే జనసేన లోను కొన్ని లోపాలు ఉండొచ్చు. అలాంటి చిన్న చిన్న లోపలని వెతికే ముందు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల ఆస్తులు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు తెలుసుకుంటే మనం ఎలాంటి వ్యక్తుల పాలనలో ఉన్నామో అర్ధమవుతుంది అని నా అభిప్రాయం. 

రాజకీయం అంటే వ్యాపారం కాదు సేవ అని నమ్మే వారు జనసేన మీద విమర్శలకి కాకుండా రాజకీయ వేదిక వాడుకోవడం మంచిది. 




Comments

  1. Yes,what you said was absolutely correct and you Explained really very well, Janasena is not aiming for power its main motive is to solve people's problems and address them
    Janasena is trying to bring some change in the society on politics
    Jai hind ✊🇮🇳

    ReplyDelete
  2. Great leader we have to stand with janasena forever strongly. To be honest naa life lo nenu chusina best leader janasenani... Ap people ki andariki telusu, kaka pota balisi kotukutunaru.

    ReplyDelete
  3. Replies
    1. Really simply superb andi intha clear ga cheapara iena Mana ap people's ki one percent kuda artham kadu.

      Delete
  4. Superr analasys bro i salute to u chala baaga chepparu

    ReplyDelete
  5. Neethi nijayathi vunna party janasena party ✊💪

    ReplyDelete
  6. చాలా బాగా చెప్పారు Brother

    ReplyDelete
  7. Yes. This is my opinion. 4000 కిలో మీటర్ల పాదయాత్ర చేయడం పరిపాలన దక్షత కి నిదర్శనం కాదు. కేవలం opposition party ని విమర్శ చేయడానికి కాదు political parties ఉన్నది. రేపటి మెరుగైన సమాజం కోసం, నేటి లోపాలు చూపి constructive గా ముందుకు వెళ్లడం చేయాలి. అదే పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.

    ReplyDelete
  8. People are realising,,in next election janasena definitely form the government

    ReplyDelete
  9. Ap people not realizing bro...

    ReplyDelete
  10. Brother Chala Baga Chepav Nijam Chepav
    Thanks Brother
    E Nijani Chala Mandhi Chusi Telusu Kovali
    Future Lo Yevariki Vote Veyadam Manchidhi Ani AloChistharu
    Hats Off To U Brother
    Jai Jenasena

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Will Ireland Create a miracle this time against England?

Top 10 must watch movies

మీ కలలో ఎప్పుడన్నా స్మార్ట్ ఫోన్ చూసారా